Shalini Thakur | అమెరికాలో భారత యువతిని వెంటాడి హత్య చేసిన భారత యువకుడు.. అనంతరం ఆత్మహత్య
Shalini Thakur : అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి హత్యకు గురైంది. షాలిని ఠాకూర్ అనే 38 ఏళ్ల భారత సంతతి యువతిని 22 ఏళ్ల యువకుడు కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికా, క్యాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో గత మంగళవారం జరిగింది.
Shalini Thakur : అమెరికాలో భారత సంతతికి చెందిన యువతి హత్యకు గురైంది. షాలిని ఠాకూర్ అనే 38 ఏళ్ల భారత సంతతి యువతిని 22 ఏళ్ల యువకుడు కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికా, క్యాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో గత మంగళవారం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితుడు రోహిత్ (22) ఈ హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాలివి. మృతురాలు షాలిని ఠాకూర్ ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా పని చేస్తుండేది. షాలిని భర్త రెండేళ్లక్రితం మరణించాడు. ఆమెకు చిన్నారి కొడుకు ఉన్నాడు.
షాలిని తన తల్లితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కొంతకాలం క్రితం షాలిని పని చేస్తున్న రెస్టారెంట్ వద్ద రోహిత్ ఆమెను చూశాడు. అతడు ఒక డోర్ పికప్ సర్వీస్‌లో పని చేసేవాడు. షాలినిని ఇష్టపడ్డ అతడు తర్వాత ఆమె గురించి తెలుసుకున్నాడు. ఆమెకు భర్త లేడని తెలిసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెతో చెప్పాడు. కానీ, దీనికి ఆమె అంగీకరించలేదు. ఎందుకుంటే ఆమెకు, అతడికి మధ్య 16 ఏళ్ల తేడా ఉంది. వయసు తేడా కారణంగా ఆమె పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికీ గత ఏడాది సెప్టెంబర్ నుంచి రోహిత్.. షాలినిని పలు రకాలుగా వేధించాడు.
ఆమెను ఫాలో కావడం, ఆమె కార్ టైర్లలో గాలి తీయడం, కారుకు లొకేషన్ ట్రాక్ చేసే డివైజ్ అమర్చడంతోపాటు వారి ఇంటికి డూప్లికేట్ కీ కూడా తయారు చేయించాడు. ఆమె ఇంట్లోకి, గదిలోకి కూడా వెళ్లి వేధించేవాడు. దీంతో ఆమె అతడి నుంచి రక్షణ కోసం కోర్టును ఆశ్రయించింది. తనను కలవకూడదని, దూరంగా ఉండాలని రోహిత్‌ను కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ, అతడు మానలేదు. ఈ వేధింపులతో ఆమె తీవ్రంగా వేదనకు గురైంది. గత మంగళవారం కూడా ఆమెను వెంబడించాడు. ఈ క్రమంలో ఆమెను చంపేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించింది.
అయినప్పటికీ, ఆమెను వెంబడించి మరీ తన దగ్గరున్న పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తగిలి ఆమె కిందపడిపోగా.. దగ్గరకు వెళ్లి మరోసారి కాల్చి చంపాడు. ఆమె మరణించిందని ఖాయం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సమాచారం అందుకుని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిచారు. ఒక కారులో పారిపోతుండగా హైవేపై పోలీసులు అతడి కారును చుట్టుముట్టారు. ఈ సమయంలో కారు ఒక చోట ఢీకొని ఆగిపోయింది. పోలీసులు దగ్గరకు వెళ్లి చూడగా.. అతడు కారులోనే తన పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
:
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

