KTR | సిరిసిల్ల టౌన్, నవంబర్ 23: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. భుజం గాయంతో బాధపడుతూ ఆగయ్య ఇటీవల సర్జరీ చేయించుకున్నారు.
కాగా విషయం తెలుసుకున్న కేటీఆర్ ఆయనతో ఆదివారం ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు నొప్పి నయమయ్యేవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.