KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోమవారం మూడు జిల్లాల పర్యటనతో బిజీగా ఉండనున్నారు. తొలుత సంగారెడ్డిలో అనంతరం కరీంనగర్, సిరిసిల్లలో కేటీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సంగారెడ్డి జైలులో ఉన్న మన్నె క్రిశాంక్‌ను, కరీంనగర్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీఎంజే జువెల్లర్స్ సిబ్బందిని పరామర్శించి.. సిరిసిల్లలో బీజేపీ కౌన్సిలర్ బోలగం నాగరాజును కార్యకర్తల సమక్ష్యంలో కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తారు.
సోమవారం ఉదయం 9 గంటలకు నార్సింగి నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డి నియోజకవర్గానికి బయలుదేరుతారు. అక్రమ కేసులో అరెస్టై.. సంగారెడ్డి జైలులో ఉన్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్‌తో ఆయన ములాఖత్ అవుతారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతారు. అక్కడి నుంచి 11 గంటలకు సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట మార్కెట్ యార్డులో శనిగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తారు.
అనంతరం.. 11:30 గంటలకు సదాశివపేట నుంచి కరీంనగర్‌కు కేటీఆర్ బయలుదేరుతారు. స్థానిక జ్యోతినగర్‌లో నిందితుల తుపాకీ కాల్పుల్లో గాయపడి వెంకటాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న PMJ జ్యువెలరీ సిబ్బందిని మధ్యాహ్నం 3 గంటలకు పరామర్శిస్తారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సాయంత్రం 5 గంటలకు బీజేపీ కౌన్సిలర్ బోలగం నాగరాజుకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి.. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాలు శుభకార్యాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హాజరవుతారు.