Vemulawada | వేములవాడ రూరల్, జనవరి 7 : ఆటో కార్మికులకు బీమాతో పాటు వైద్య బీమాని కూడా అందిస్తున్న కేటీఆర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు చిత్రపటాలకు బుధవారం కార్మికులు, పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఆటో కార్మికులకు మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, గ్రామ సర్పంచ్ నరేష్ ఆధ్వర్యంలో బీమా కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సుతో ఇప్పటికే ఆటో కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక అనేకమంది ఆత్మహత్య చేసుకోగా మరికొందరు అనారోగ్యం బారిన పడుతున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు. భీమా కార్డులు ఇచ్చి తమ కుటుంబాలకు భరోసా నింపారని మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేములవాడ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, గ్రామ సర్పంచ్ నరేష్, పార్టీ నాయకులు గడ్డం హనుమాన్లు, వెల్మ బాల్రెడ్డి, పెండ్యాల తిరుపతి, కటకం మల్లేశం, సుమన్, అంజిబాబు, ప్రశాంత్ రెడ్డి, రమేష్ సంతోష్ శ్రీనివాస్, ఆటో కార్మిక సంఘం నాయకులు సయ్యద్ ఉమర్, దేవరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.