Kotagiri | కోటగిరి, జూన్ 28 : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భరత్ గార్డెన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభ్యత్వం, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి కోటగిరి, పోతంగల్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఉమ్మడి మండలం నుంచి ప్రతీ పల్లె పల్లె ల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున బయలుదేరారు. గ్రామాలలో వాహనాలకు గులాబీ జెండాలు ఏర్పాటు చేసుకొని జై తెలంగాణ ..జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పోవాలె.. మళ్లీ కేసీఅర్ సారె రావాలె అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ సారుపై అభిమానంతో కోటగిరి, పోతంగల్ మండలాల నుండి వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్, తెల్ల రవికుమార్, సూదం నవీన్, డాక్టర్ హాకీం, సమీర్, నజీర్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, పాల గంగారం, కన్నం సాయిలు, యోగేష్, గగన్,అజ్మీర్ కిషన్, కొత్తపల్లి రాజు, సుద్దులం విజయ్,గంగాధర్, ఆంజనేయులు, జలాల్, బేగరి మారుతి తో పాటూ తదితరులు ఉన్నారు.