MLA Kalvakuntla Sanjay | కోరుట్ల, జూన్ 12: పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు. హరీష్ మృతికి గల కారణాలు తెలుసుకొని కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, నాయకులు గంగాధర్, బాబా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.