కోల్‌సిటీ/ అంతర్గాం మే 1: ‘కాంగ్రెస్సోళ్లకు ఉన్నట్లు నాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. వ్యాపారాలు లేవు. కార్మికు డి బిడ్డగా పైవింక్లయిన్ పుట్టక ముందు నుంచే మీ కోసం పోరాడిన వ్యక్తిని’ అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మీ ఇంట్ల మనిషిలెక్క మీకండ్ల ముం దుండె తనను పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా మారుతాన ని హామీ ఇచ్చారు. ప్రజలు ఆలోచించి కారుకు ఓటేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. ఇన్నాళ్లు మీ ఓట్లతో ఆస్తులు, వ్యాపారాలను వృద్ధి చేసుకున్న నాయకులకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రామగుండం 12వ డివిజన్ కా ర్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్ ఆధ్వర్యంలో ఫైవింక్లయిన్లో బుధవా రం సీనియర్ సిటిజన్స్‌తో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. వృద్ధులను ఆత్మీయంగా పలుకరించి స మస్యలు తెలుసుకున్నారు. అంతర్గాం మండలంలో విస్త్రత ప్రచారం చేశారు. సాయంత్రం అంతర్గాంలో నిర్వహించి న కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు.
సింగరేణిలో రక్తాన్ని చెమట గా ధారబోసి బొగ్గును వెలికితీసే కార్మికుల కష్టం తెలుసన్నారు. విరమణ త ర్వాత వారు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తెరిగిన వాడినన్నారు. తెలంగాణ వ చ్చిన తర్వాత చిక్కుల్లో ఉన్న సింగరేణిని కా పాడిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. కార్మికులు బార్డర్లో సైనికులతో సమానమని భావించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. సమైక్య పాలకులు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపారని చెప్పారు. కానీ, నాలు గు నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రజలను కష్టాల్లోకి నెట్టిందని దుయ్యబట్టారు. ప్రజలు కరెంట్ కో తలు, తాగు, సాగునీటి కొరతతో అల్లాడుతుంటే చోద్యం చూస్తున్నదని విమర్శించారు. మోసపూరిత 420 హామీలతో అధికారంలోకి వ చ్చిందని మండిపడ్డారు. వెంకటస్వామి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే అంతర్గాం స్పిన్నింగ్, వీవీంగ్ మిల్లు మూతపడ్డదని గుర్తుచేశారు. అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని కొనియాడారు. ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. కార్మికుల జీవితాలనే మార్చిన వ్యక్తి కేసీఆర్ అని, ఆ కృతజ్ఞతగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైఎస్ ఎంపీపీ మట్టలక్ష్మీ మహేందర్‌రెడ్డి, నా యకులు కౌశికహరి, ధరిణి రాజేశ్, తుం గపిండి సతీశ్, కుర్ర నూక రాజు ధర్మాజీ కృష్ణ, కుర్ర వెంకటమ్మ, కోల సంతోష్, కొలిపాక మధూకర్‌రెడ్డి, పీటీ స్వామి, మురళీధర్ రావు పాల్గొన్నారు.