Konda Laxman Bapuji | చిగురుమామిడి, సెప్టెంబర్ 21 : స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని, తన జీవితాన్ని ఉద్యమానికి ధారబోశాడని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. వారి ఆశయాల కోసం అన్ని వర్గాల ప్రజలకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మంచికట్ల కనకయ్య, కోశాధికారి ఎన్నం వెంకటేశం, వివిధ గ్రామాల అధ్యక్షులు బైరి శ్రీనివాస్, అంబటి బిక్షపతి, దాసరి రవీందర్, మోర పద్మనాభం, వేముల ప్రకాష్, మల్లేశం, రాజు, దాసరి సదానందం, కనకయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.