siricilla | సిరిసిల్ల టౌన్, జనవరి 14: కార్మికక్షేత్రమైన సిరిసిల్ల లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంక్రాంతి పండుగ కు నూతన శోభను తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక బతుకమ్మ ఘాట్ వేదికగా ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి అద్భుతమైన ఆదరణ వచ్చింది. పెద్ద సంఖ్యలో చిన్నారులు, యువకులు తరలివచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నవారికి పతంగులు, ధారాలను అందజేసి ప్రోత్సహించారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ , ద్వితీయ, తృతీయ స్థానాల్లో బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. అదే విధంగా సోమ, మంగళ వారాలలో వాడవాడలా నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుండి విశేష స్పందన లభించింది. దాదాపు 5వేల మందికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ జిందం కళ, సెస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, సత్తార్, దార్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.