Marathon | ఖానాపూర్, అక్టోబర్ 12: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీల్లో ఖానాపూర్ పట్టణానికి చెందిన 21 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో 5కే, 10కే, 21కే హాఫ్ మారథాన్ రన్‌కు హాజరైనట్లు ఖానాపూర్ రన్నర్ (21కి 3rd విజేత) డాక్టర్ ఐలినేని కిరణ్ కుమార్ తెలిపారు.
ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, వివిధ వృత్తుల వృత్తుల వారు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు (డ్రగ్స్)వ్యతిరేకంగా నిర్వహించిన ఈ మారథాన్ పోటీలకు ఖానాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రత్యేకంగా బహుమతి ప్రదానం చేశారన్నారు.
రన్నింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది పథకాలను కైవసం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌కు చెందిన క్రీడాకారులు అభిమానులు వారిని అభినందించారు. ఇందులో రాజేందర్, రాజు యాదవ్, వెంకట్రాములు, శివ శంకర్, చరణ్, మల్లేష్, ఎల్లయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్‌లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్