Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 26: భారత రాష్ట్ర సమితి పండుగను ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో చరిత్రలో నిలిచిపోయేలా మహాసభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి కేసీఆర్ సభకు వచ్చేందుకు వాహనాలు ఏర్పాట్లు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యం, ఇతరత్రా సౌకర్యాలను నాయకులతో చర్చించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తరత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మహాసభ గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం సంచరించుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకుడు సాంబారీ కొమురయ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి కార్యకర్తలతో ముచ్చటించి సమావేశానికి హాజరుకావాలని కోరారు.
గ్రామాల్లో ముఖ్య నాయకులతో పాటు గ్రామ అధ్యక్షుల పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. భారీగా తరలివచ్చే మహాసభకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడొద్దని అన్నారు. మండలం నుండి సుమారు 3 వేలకు పైగా కార్యకర్తలు మహాసభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అందుకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, నాయకులు నల్ల రాజేందర్ రెడ్డి, బిళ్ల వెంకటరెడ్డి, కంప అశోక్, సందీప్ రెడ్డి, దిలీప్ రెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.