KORUTLA | కోరుట్ల, మార్చి 28: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేములవాడ నుంచి నుంచి వచ్చిన కాయకల్ప బృందం సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత రాణితో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ ఏటా అందించే కాయకల్ప అవార్డును ఇంటర్నల్ పీర్ అసెస్మెంట్లో భాగంగా బృందం సభ్యులు ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను సందర్శించి స్వచ్ఛత, సదుపాయాలు, బయో మెడికల్ వేస్టేజ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, పారిశుధ్య రికార్డుల నిర్వహణ, సిబ్బంది పని తీరు, ప్రసవాల సంఖ్య, ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య, ఫైర్ ఆక్సిడెంట్ ట్రైనింగ్, ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి, ఫొటో కాల్, ఆసుపత్రి నిర్వహణ అంశాలపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ కాయకల్ప బృందం సభ్యులు డాక్టర్ రవీందర్ డాక్టర్ అనిల్, అధికారులు బ్లోసమ్, ఝాన్సీ రాణి, ఆర్ ఎం ఓ డాక్టర్ వినోద్, శానిటేషన్ ఇన్చార్జి డాక్టర్ రమేష్, వైద్యురాలు చైతన్య సుధా, నిలోఫర్, కల్యాణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సరళ, లలిత, మేరీ కవిత, కరుణ, ఫార్మసిస్ట్ ఉదయ ప్రసాద్, శానిటేషన్ సూపర్వైజర్ మర్రి సంతోష్, రాజేందర్, టీబీ, ఐసీటీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.