e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కరీంనగర్ కేసీఆర్‌తో దివ్యాంగులకు భరోసా

కేసీఆర్‌తో దివ్యాంగులకు భరోసా

  • అన్ని విధాలా ఆదుకున్న ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుదే
  • మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌
  • 814 మందికి సహాయ ఉపకరణాల అందజేత

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 27: సీఎం కేసీఆర్‌తోనే దివ్యాంగులకు భరోసా లభిస్తున్నదని, వారి సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ వ్యవసాయ మారెట్‌ యార్డులో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు, ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ మానవత్వానికి మారుపేరు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. సమైక్య పాలనలో రూ.500 పింఛన్‌ ఇస్తే, స్వయం పాలనలో ఆ పింఛన్‌ను రూ.3016కు పెంచి వారికి ఆత్మగౌరవాన్ని కల్పించారన్నారన్నారు. స్వయం పాలనలో దివ్యాంగులను కన్న బిడ్డల్లా గుండెలకు హత్తుకున్నారన్నారు. గతంలో ఇలాంటి సూటర్‌ ఇవ్వాలంటే వికలాంగులు 70 శాతం డబ్బులు చెల్లిస్తే, ప్రభుత్వం 30 శాతం చెల్లించేదని, ఇదికూడా ఒకరికో, ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకునే వారన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల కష్టాలకు స్పందించి ఈ ఉపకరణాలను పూర్తి ఉచితంగా అందజేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో పాటు, ఇతర ఏ రా ష్ట్రాల్లో సైతం దివ్యాంగులకు ఇలాంటి పరికరాలు ఉచితంగా ఇవ్వలేదన్నారు.

- Advertisement -

దివ్యాంగులు ఆధైర్యపడొద్దని, అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. తెలంగాణ రాక ముందు వికలాంగుల కార్పొరేషన్‌ మొకుబడిగా ఉండేదని, అందులో ఎన్నడూ వికలాంగులను పట్టించుకున్న పరిస్థితులు, వారి అవసరాలు తీర్చిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులు ఉంటే వారికోసం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 7వేల మందికి ప్రతి నెలా రూ.21 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఓబీఎంఎంఎస్‌ ద్వారా ఇంటివద్ద నుంచే దరఖాస్తు చేసుకున్న 814మంది దివ్యాంగులకు రూ.కోటి 25లక్షల 45వేల 12రకాల సహాయ ఉపకరణాలను మంత్రు లు అందజేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మె ల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ కనుమళ్ల విజయ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధికా శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొలిపాక నిర్మల, మార్కెట్‌ చైర్మన్‌ బర్మావత్‌ రమ, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ దివ్యదేవరాజన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, డీఈడబ్ల్యూవో శారద, వికలాంగుల సంస్థ ఎండీ శైలజ, స్థానిక కౌన్సిలర్లు కొండ్ర జీవిత, భాషవేన వనిత, ఆయా శాఖల అధికారులు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు భారం కాకుండా
మాలాంటి దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక ప్రభుత్వం టీ ఆర్‌ఎస్సే. సీఎం కేసీఆర్‌ దివ్యాంగులకు అండగా ఉండి పూర్తి సబ్సిడీతో అడిగిన వెంటనే వస్తువులను ఉచితంగా ఇస్తున్న దేవుడు ఆయన. పుట్టుకతోనే నాకు పోలియో. రెండు కాళ్లు పని చేయవు. తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో టు వీలర్‌ బైక్‌ అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న నాకు ఏదైనా స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అందించిన టూ వీలర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి మేం కూడా వచ్చే ఎన్నికల్లో అండగా ఉండి సీఎం కేసీఆర్‌ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుంటాం.
-పోతరవేణి రజిత, కాచాపూర్‌ గ్రామం, శంకరపట్నం మండలం.

గతంలో ఎవరూ పట్టించుకోలె
ఎలాంటి సహాయం లేకుండా నడవలేని నాకు ద్విచక్ర వాహనం పూర్తి సబ్సిడీతో అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చచ్చేదాకా రుణపడి ఉంట. వికలాంగులను భారంగా భావించే నేటి సమాజంలో అందరితో సమానంగా బతకాలన్న ఆశ కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంతో నాకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదరిస్తున్నట్లుగా గతంలో ఎవరూ మమ్మల్ని పట్టించుకోలే. తెలంగాణ ప్రభుత్వం మాలాంటి వారి కోసం ఎంతో ఖర్చు చేసి ప్రతి ఒక్క పరికరాన్ని ఉచితంగా అందించడం పట్టలేని సంతోషం కలిగిస్తున్నది. రూ.3016 పింఛన్‌ అందించి కుటుంబాలకు తోడుగా ఉంటున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉండి ఈ ప్రభుత్వానికి అండగా ఉంటం.
-ఆరే సాయికృష్ణ, ముత్తారం, శంకరపట్నం మండలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana