Farmers Protest | సైదాపూర్, జనవారి 31: సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో రైతులు ధర్నా చేశారు.
మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా దుద్దనపల్లి నుంచి గుజ్జులపల్లి వరకు గతంలో నీటిని సరఫరా చేసేవారు. యాసంగి సీజన్లో ఈ నీటి మీదనే ఆధారపడి రైతులు సాగు చేస్తుంటారు. అయితే కొంతకాలంగా కాలువల్లో మట్టి పేరుకుపోయి చెత్త చెదారంతో పాటు చెట్లు మొలిచి అధ్వాన్నంగా తయారైంది. దీంతో మిడ్ మానేరు కుడి కాలువ నుంచి వచ్చే నీరు అక్కడే నిలిచిపోతుంది. దీంతో కాల్వను మరమ్మతు చేసి తమకు నీటిని అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.