కాంగ్రెస్ పాపం.. నారాయణపూర్‌కు శాపం
ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలకులు చేసిన పాపం నారాయణపూర్ నిర్వాసితుల పాలిట శాపంగా మారిందని ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
- రిజర్వాయర్ కట ్టశాశ్వత మరమ్మతుకు రూ.కోటి
- యాసంగికి నీరందిస్తాం
- నిర్వాసితులను ఆదుకుంటాం
- దేశానికి పట్టిన చీడ పురుగులు బీజేపీ, కాంగ్రెస్
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, నవంబర్ 23 : ఆనాటి కాంగ్రెస్ పార్టీ పాలకులు చేసిన పాపం నారాయణపూర్ నిర్వాసితుల పాలిట శాపంగా మారిందని ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. మండలంలోని మధురానగర్‌లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2008లో అప్పటి కాంగ్రె స్ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి జీవో ఇచ్చారన్నారు. 2011-12లో అగ్రిమెంట్ అయిందని, 2013 వరకు నామమాత్రంగా పనులు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారని మండిపడ్డారు. 2008లోనే నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటిస్తే ఇప్పడు సమస్య వచ్చేది కాదని పేర్కొన్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టు ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారో చెప్పాలన్నారు. నారాయణపూర్‌ను మునిగిపోయేలా చేసింది.. ని ర్వాసితులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. 1983లో భారీ వర్షాలకు నారాయణపూర్ చెరువు కట్ట తెగిపోయి ఊళ్లు జలమయమయ్యాయని గుర్తు చేశారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలకు 39 ఏండ్ల తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్, గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టలు తెగిపోవడంతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ప్ర తిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మి నిర్వాసితులు ఆందోళన చెందవద్దని, సీఎం కేసీఆర్ దృ ష్టికి తీసుకువెళ్లి రిజర్వాయర్ కింద నారాయణపూ ర్, చెర్లపల్లి(ఎన్), మంగపేట గ్రామాల ప్రజలకు న్యా యం చేస్తామన్నారు. రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న 89 ఎకరాలకు రూ.16 కోట్ల 50 లక్షలను మంజూరు చేయించినట్లు, త్వరలోనే బాధితులకు అందజేస్తామన్నారు. నారాయణపూర్ కట్ట శాశ్వత మరమ్మతుకు రూ.కోటి మంజూ రు చేయించినట్లు తెలిపారు. రైతులు ఆం దోళన చెందవద్దని, యాసంగి పంటలకు సాగునీందిస్తామని భరోసా కల్పించారు.
కరీంనగగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా తెచ్చి చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడా అన్ని ప్రశ్నించారు. దమ్ముంటే బండి సంజయ్ నిధులు తేవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టాలని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో గంగాధర, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్‌రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్ చై ర్మన్లు వేముల భాస్కర్, సామంతుల శ్రీనివాస్, ఆత్మ, చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎండీ నజీర్, ఆకుల శంకరయ్య, ముక్కెర మల్లేశం, రాసూరి మల్లేశం, జోగు లక్ష్మీరాజం, పానుగంటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మ ధుసూదన్ రెడ్డి, నాయకులు రామిడి సురేందర్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, దుర్గయ్య, సురేశ్, మల్లయ్య, కళ్యాణ్, నరోత్తంరెడ్డి, చందు, వినోద్, కుమార్, అజేయ్, కళ్యాణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

