Minister Adluri Laxman Kumar | ధర్మారం, అక్టోబర్5: ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి మాజీ దివంగత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు . ఈ సందర్భంగా మంత్రి కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడని కాకా అని అన్నారు. వెంకటస్వామి పేద ప్రజల కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అనంతరం చౌరస్తాలో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.