Mallapur | మల్లాపూర్, జూన్ 30 : సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి జర్నలిస్ట్ లు కృషి చేయాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ ఎల్లావేళలా అండగా ఉంటుందన్నారు.
అనంతరం మల్లాపూర్ నూతన ప్రెస్ క్లబ్ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అధ్యక్షుడిగా రుద్ర రాంప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఉడుగుల గంగాధర్, ప్రధానకార్యదర్శిగా నూనె ఆంజనేయులు, కార్యదర్శిగా మోర సతీష్, కొశాధికారిగా అదరి రాజేందర్ తో పాటు, పలువురు కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు కనుక సంజీవ్, కార్యదర్శి తోకల పవన్, మాజీ అధ్యక్షుడు ముత్యాల రమేష్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పెంబి మహేష్, సభ్యులు ఆకుతోట నర్సయ్య, జరుపుల రమేష్, వంగ శేఖర్, దొంతి సుధాకర్, ఎగ్యారపు శ్రీనివాస్, బండారి వెంకటేష్, మూడంపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.