Bhupatipur | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 12 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతోపాటు చదువులో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి మహాత్మ జ్యోతిబాపూలే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 13 గురుకుల పాఠశాలలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల్లో భాగంగా వాలీబాల్, కబడ్డీ, కోకో తో పాటు పలు క్రీడలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు తగిన వసతులను కల్పించడం జరిగిందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.