ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జడ్పీ సభ్యులు మండిపడ్డారు. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు తీర్మానం చేయాలని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ షుక్రుద్దీన్ సభ దృష్టికి తేగా, మంత్రి గంగుల, జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి జడ్పీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బండి సంజయ్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
– కరీంనగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ)