జగిత్యాల టౌన్/ఇబ్రహీంపట్నం/మల్లాపూర్/ పెగడపల్లి/ వెల్గటూర్/ జగిత్యాల రూరల్/ సారంగాపూర్/మెట్పల్లి రూరల్/ కోరుట్ల/కోరుట్లరూరల్/మేడిపల్లి/కథలాపూర్/గొల్లపల్లి/రాయికల్/కొడిమ్యాల, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.20 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 11,636 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. అలాగే, జిల్లాలో 175 లోకల్ బాడీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో 97.75 శాతం, 13 ప్రభుత్వ పాఠశాలల్లో 93.18 శాతం, 13 మోడల్ స్కూళ్లలో 99.07 శాతం, 14 కేజీబీవీల్లో 97.49 శాతం, 2 టీఎస్ఆర్ఎస్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 94.66 శాతం, 5 టీఎస్డబ్ల్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 99.38 శాతం, 5 టీఎంఆర్ఎస్ రెసిడెన్షియల్ మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్లల్లో 98.58 శాతం, 6 బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
బీర్పూర్ మండలంలో 100 శాతం, బుగ్గారం మండలంలో 100 శాతం, ధర్మపురి మండలంలో 98.59 శాతం, గొల్లపల్లి మండలంలో 99.77 శాతం, ఎండపెల్లి మండలంలో 100 శాతం, ఇబ్రహీంపట్నం మండలంలో 99.05 శాతం, జగిత్యాల మండలంలో 97.73 శాతం, జగిత్యాల రూరల్ మండలంలో 99.03 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కథలాపూర్ మండలంలో 98.80 శాతం, కొడిమ్యాల మండలంలో 95.17 శాతం, కోరుట్ల మండలంలో 96.99 శాతం, మల్లాపూర్ మండలంలో 99.29 శాతం, మల్యాల మండలంలో 99.29 శాతం, మేడిపల్లి మండలంలో 98.24 శాతం, మెట్పల్లి మండలంలో 98.04 శాతం, పెగడపల్లి మండలంలో 99.04 శాతం, రాయికల్ మండలంలో 99.46 శాతం, సారంగాపూర్ మండలంలో 99.53 శాతం, వెల్గటూర్ మండలంలో 97.17 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆయా పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.