MISSING | కథలాపూర్, ఏప్రిల్ 12 : కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల దేవేంద్ర (50) మహిళ అదృశ్యం కాగా కేసు నమోదు చేసినట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. దేవేంద్ర ఈ నెల 11న ఇంటి నుండి బయలుదేరి కోరుట్ల పట్టణానికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. కానీ ఇంటికి తిరిగి రాలేకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు.