పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన శ్రీరాం కేత (32) అనే మహిళ మంగళవారం ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందినట్లు ఎస్సై కిరణకుమార్ పేర్కొన్నారు. మండలంలోని రాంబదృనిపల్లికి చెందిన శ్రీరాం పర్శరాంను వివాహం చేసుకున్న కేత, గత కొంత కాలంగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్న కేత రెండు రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వచ్చిన్నట్లు చెప్పారు.
నొప్పులకు చికిత్స తీసుకుంటున్న ఆమె సరిగా నడువ లేని స్థితిలో బాత్రూంకు వెళ్లగా, అందులో జారి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వివరించారు. అది గమనించిన తండ్రి కావటి మల్లయ్య వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం జగిత్యాలకు దవాఖానకు తీసుకెళ్లగా, కేత అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తహసీల్దార్ ఆనంద్ కుమార్ పంచనామా నిర్వహించగా, తండ్రి మల్లయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.