MLA Dr. Sanjay Kumar | సారంగాపూర్, మే 28: తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని కందెనకుంట, చర్లపల్లి, నరసింహులపల్లి గ్రామాల్లో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగా రావడం, బీర్ పూర్ మండలం లో పంట ఆలస్యం గా చేతికి రావడం వల్ల కూడా నష్టం జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరు ఆపలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతులు వరి సాగు మాత్రమే కాకుండా పంట మార్పిడి చేయటం వల్ల లాభాలు ఆర్జించవచ్చని అన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్ ముప్పాల రామచందర్ రావు, నాయకులు నారపాక రమేష్, రీక్కల ప్రభాకర్, సుషిన్, నరేందర్, శీలం రమేష్, రామచంద్రం గౌడ్, ఆడేపు రవి , హరీష్, హరి నాయక్ , భీమయ్య, సంతోష్, రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.