మెట్పల్లి మార్చి 4: పసుపు పంటకు రూ.15వేలు మద్ధతు ధర ప్రకటించాలని రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు క్రయ, విక్రయాలను పరిశీలించారు. పసుపుకు కనీసం గిట్టుబాటు ధర లభించక రైతులు(Turmeric farmers )తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మద్దతు ధర ప్రకటించాలన్నారు.
నాఫేడ్ ద్వారా గాని మార్క్ ఫేడ్ ద్వారా గాని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి పసుపు కొనుగో చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు పసుపుకు మద్దతు ధర ప్రకటిస్తామని కాంగ్రెస్ విడుదల చేసిన డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పసుపు రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేష్ రెడ్డి, నాయకులు మారు మురళీధర్ రెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, యాళ్ల తిరుపతిరెడ్డి, మామిడి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.