మల్లాపూర్, అక్టోబర్ 7: గత ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమాని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇప్పటికే రైతుబంధు, రైతు రుణమాఫీ, సరిపడా యూరియా అందక సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
అలాగే కనీసం రైతులకు మక్కజొన్న కోనుగోలు కేంద్రాలు ఇప్పటికి ఏర్పాటు చేయకపోవడం సరికాదని, దీనిపై రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10న తలపెట్టిన ధర్నాకు తమ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు వేంపేట నర్సారెడ్డి, బద్దం అంజరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కదుర్క నర్సయ్య, నాయకులు దేవ మల్లయ్య, ఏనుగు రాంరెడ్డి, ముద్దం శరత్ గౌడ్, మ్యాకల సతీష్, బండి లింగస్వామిగౌడ్, కొడూరి బిక్షపతి, మొరపు గంగరాజం, పన్నాల రవీందర్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, నారాయణరెడ్డి, రాజశేఖర్, రాజరెడ్డి, మురళి, తదితరులు పాల్గొన్నారు.