తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించుకున్నారు. జడ్పీ, మున్సిపల్, పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. వారి ప్రాణత్యాగంతోనే స్వరాష్ట్రం కల సాకారమైందని గుర్తు చేశారు. కాగా, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, మెట్పల్లి, మల్యాల మండలాల్లో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్ పాల్గొని అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
– జగిత్యాల, జూన్ 22 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అం దంగా అలంకరించారు. గురువారం ఉదయం అ ధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ కారులు, జేఏసీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్తూపాల వద్దకు చేరుకొని పూలు చల్లి నివాళులర్పించారు. ‘తెలంగాణ అమరులకు జోహార్’ అంటూ నినదించారు. జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్, గ్రా మ పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పా టు చేసి, అమర వీరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరుల కుటుంబ సభ్యులను సన్మానించి, భావోద్వేగానికి లోనయ్యారు. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని, అమరుల త్యాగం వల్లే స్వరాష్ట్రం సాకారమైందని స్పష్టం చేశారు. కాగా, జగిత్యాల పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు మంద మకరంద, బీఎస్ లత, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, తదితరులు పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు.
అనంతరం పద్మనాయక కల్యాణమండపంలోని మినీ ఫంక్షన్ హాలులో జరిగిన జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 36 మంది అమరవీరుల కుటుంబసభ్యులకు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి శివారులోని 63వ నంబరు జాతీయ రహదారిపై గల తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పూలమాల వేసి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం రెం డు నిమిషాలు మౌనం పాటించారు. మెట్పల్లి ప ట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో గల డివైడర్ వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించా రు. మల్యాల మండల ప్రజాపపరిషత్ ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని అమరవీరుల స్తూప చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ మిట్టపల్లి విమల-సుదర్శన్ దంపతులను సత్కరించారు.