Korutla | కోరుట్ల, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు నైను సైతం అంటూ ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి మొక్కను నాటి ఆదర్శంగా నిలిచింది. కోరుట్ల మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్ పూర్ కు చెందిన శనిగరపు మాళవిక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన తండ్రి రాజేశంతో కలిసి ఆలయ ప్రాంగణంలో గురువారం మొక్కలు నాటి నీరందించింది.
పెళ్లి బట్టల్లో నవ వధువు మొక్కను నాటడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ హితం కోరి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని నవ వధువు సూచించింది.