కోరుట్ల, సెప్టెంబర్ 9 : ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటు కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కళాశాల నుంచి జాతీయ రహదారి మీదుగా కొత్త బస్టాండు, ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ తీశారు.
ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.