Athletics | మెట్పల్లి, ఫిబ్రవరి 8: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తయ్య రెడ్డి అన్నారు. ఇవాళ మెట్పల్లి పట్టణంలోని మినిస్ట్రీలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 25 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముత్తయ్య రెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీర ధృడత్వంతోపాటు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓటమితో కుంగిపోకుండా స్ఫూర్తిగా తీసుకొని గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ నెల 18, 19 న హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నుంచి ఎంపిక చేసిన 25 మంది క్రీడాకారులను పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పిడి గంగాధర్ అంజయ్య, కార్తీక్, శ్రీలత, రవళి, జ్ఞానేశ్వర్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా