మల్యాల : జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన కమిషనర్‌కు ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
తదనంతరం స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ స్థానాచారి కపిందర్ స్వామి కమిషనర్‌కు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదం అందజేశారు. కమిషనర్ వెంట స్థానిక ఎస్ఐ నరేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.