జగిత్యాల అర్భన్, డిసెంబరు 13: పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మా ట్లాడుతూ, గతంలో కంటే పట్టణాన్ని చాలా మెరు గ్గా అభివృద్ధి చేసుకున్నామని, జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మహిళా డిగ్రీ కళాశాలలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టడంతో పాటు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ కేసీఆర్ కాలనీకి డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకులు, కరెంట్, నీటి సదుపాయాల కోసం మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.
బల్దియా కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కే సంతోష్ భార్య బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుండగా బల్దియా చైర్పర్సన్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దీనికి ఎమ్మెల్యే స్పందించిన ఆ బాధితురాలుకు రూ. 5 లక్షల ఎల్వోసీని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే తన సొంత డబ్బులు రూ. 50 వేలు ఇస్తానని తెలిపారు. చైర్పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ, చివరి వార్డుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సారథ్యంలో వార్డులు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై బల్దియా కౌన్సిల్ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించారు. ఈ సందర్భంగా బల్దియాలో ప్రవేశపెట్టిన తీర్మానాలు, నూతన పట్టణ బల్దియా కార్యాలయానికి 2 ఎకరాలు, బుడుగ జంగాల, గోత్రాల కులస్తులకు శ్మశాన వాటికలకు జంగాలకు ఎకరం స్థలం, క్రిస్టియన్లకు 4, హిందూ శ్మశానవాటికలకు 5, ముస్లింలకు 4 ఎకరాలు కేటాయించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాగే ఆటోనగర్‌కు 20, పార్కింగ్ స్థలానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని సూచించారు.
పట్టణంలోని 48 వార్డుల్లో ఎక్కడికక్కడ చె త్త సేకరణకు 67 వాహనాలు ఏర్పాటు చేసి స్వచ్ఛ జగిత్యాలకు కృషి చేస్తున్నామని, మార్కెట్లు, రో డ్లు, పార్కులు, టౌన్‌హాల్, డ్రైనేజీలు, బతుకమ్మ ఘాట్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మట్టి రోడ్లను సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నామని, ఎన్నో ప్రభుత్వాలు మారినా జగిత్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవతో ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు విన్నవించిన పలు సమస్యలకు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులను మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు. సమావేశంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఇన్చార్జి కమిషనర్ రాజేశ్వర్, అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.