చరిత్ర గుర్తించని మహావీరుడి కథ
మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండటం వెనుక ఎంతోమంది త్యాగాలన్నాయి. ఈ విషయంలో అంతా రాజుల గురించి మాట్లాడతారు కానీ, ప్రాణత్యాగాలు చేసిన వారియర్స్ గురించి మాట్లాడరు. వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే వారియర్ ఉండేవాడు.
‘మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండటం వెనుక ఎంతోమంది త్యాగాలన్నాయి. ఈ విషయంలో అంతా రాజుల గురించి మాట్లాడతారు కానీ, ప్రాణత్యాగాలు చేసిన వారియర్స్ గురించి మాట్లాడరు. వెయ్యేళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో కృష్ణ అనే వారియర్ ఉండేవాడు. అతడి కథే ‘స్వయంభు’. అల్లరిగా తిరిగే ఓ అండర్ డాగ్.. రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా చేరాడు అనేది ఇందులో చూపించాం. ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన కథ’ అని హీరో నిఖిల్ అన్నారు. ఆయన వారియర్‌గా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. సంయుక్తమీనన్, నభా నటేష్ కథానాయికలు. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ త్రీడీ ఫార్మాట్ టీజర్‌ని హైదరాబాద్‌లోని ప్రసాద్ PCX థియేటర్లో బుధవారం ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడారు. ‘డైరెక్టర్ భరత్‌కృష్ణమాచారి రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. శ్రద్ధాభక్తులతో అన్ని జాగ్రత్తలూ తీసుకొని ‘స్వయంభు’ చేశాను. అంతా గర్వపడేలా, సాంకేతికంగా అబ్బురపరిచేలా అంతర్జాతీయ విలువలతో ఈ సినిమా ఉంటుంది. ఈ టీజర్ పరిచయం మాత్రమే. ముందుముందు వచ్చే కంటెంట్‌తో ఆసకికరమైన ఎన్నో అంశాలను పరిచయం చేస్తాం.’ అని నిఖిల్ తెలిపారు. శ్రీరాముడికి పరమేశ్వరుడు అందించిన సెంగోల్‌ను స్వాధీనం చేసుకునేందుకు జరిగే భీకర పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తమని టీజర్ ద్వారా దర్శకుడు భరత్‌కృష్ణమాచారి తెలియజేశారు. 985AD కాలంలో సాగే ఈ కథలో యుద్ధవీరుడిగా నిఖిల్ అద్భుతంగా నటించారని ఆయన పేర్కొన్నారు. ఇంకా డీఓపీ సెంథిల్‌కుమార్, కథానాయికలు సంయుక్త మీనన్, నభా నటేష్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

