కోరుట్ల: కోరుట్లలో (Korutla) తండ్రి, కొడుకులు కత్తులతో దాడిచేసుకున్నారు. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వారిని దవాఖానకు తరలించారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయిన కుమారుడు (37) అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులు చెల్లించాలని గతకొంతకాలంగా తండ్రిపై ఒత్తిడి చేస్తున్నాడు. తనను తండ్రి పట్టించుకోకపోవడంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. గురువారం ఉదయం కత్తితో దాడిచేశాడు. ప్రతిగా తండ్రి కూడా అతనిపై కత్తితో దాడిచేశాడు. పరస్పరం కత్తులతో దాడిచేసుకోవడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులువారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.