Rythu Mitra | జగిత్యాల రూరల్ జూన్ 8 : రైతుల సంక్షేమానికి కీలకమైన రైతు మిత్ర ఫార్మర్ ఫ్రెండ్ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించబడుతుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి పంటల సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించనున్నారు.
రైతు మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వ్యవసాయ డివిజన్ హెడ్ క్వార్టర్స్ సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రైతులు తమ పంటల నిర్వహణ, మృత్తిక, నీటి వనరుల, చీడపీడల వంటి అంశాలపై నిపుణుల మార్గదర్శకంలో పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పంటలకు సంబంధిత సమస్యల సమగ్ర పరిష్కారం అవసరాన్ని బట్టి ప్రత్యేక సలహాలు అందించనున్నారు. నిపుణుల ప్రత్యక్ష మార్గనిర్దేశం ద్వారా రైతులకు అవగాహన పెంపొందించబడుతుంది. కార్యచరణ విధానంపై ప్రతి సోమవారం ఇద్దరూ లేదా ముగ్గురు శాస్త్రవేత్తలతో, రైతులతో వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా సమావేశం అవుతారు.
రైతుల సమస్యల రికార్డులను ప్రామాణికంగా నిర్వహించడమే కాకుండా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ పైలెట్ ప్రాజెక్టు తేది 9 .6 .2025 జిల్లాలోని ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ADA) (R) కార్యాలయంలో ప్రారంభమవుతుంది రైతులందరి అవకాశం ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి