RTC Bus | తగ్గేదేలే.. పోలీసులను ఓవర్ టేక్ చేసిన ఆర్టీసీ బస్సు దొంగ.. వీడియో
RTC Bus | గుర్తు తెలియని వ్యక్తి కోరుట్ల బస్టాండ్‌లోకి ప్రవేశించి బస్సును తీసుకెళ్తుండగా.. సమాచారమందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఈ క్రమంలో ఆ దొంగ వేగంగా బస్సును తీసుకెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోవడంతో పలువురికి కూడా గాయాలయ్యాయి.
RTC Bus | కోరుట్లలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును దొంగతనం చేసిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి కోరుట్ల బస్టాండ్‌లోకి ప్రవేశించి బస్సును తీసుకెళ్తుండగా.. సమాచారమందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సును వెంబడించారు. ఈ క్రమంలో ఆ దొంగ వేగంగా బస్సును తీసుకెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోవడంతో పలువురికి కూడా గాయాలయ్యాయి.
బస్సు నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయింది. దీంతో వెనుకాలే ఫాలో అవుతున్న పోలీసులు బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు బస్సును వెంబడిస్తున్న వీడియో ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో బయటకొచ్చింది.
ఓ పోలీసుల బృందం బస్సును చేజ్ చేస్తుంటే.. ఆ బస్సు వచ్చే మార్గంలో మరో పోలీస్ టీం మెట్ పల్లి బస్ డిపో వద్ద మాటు వేసింది. మెట్ పల్లి బస్ డిపో సమీపంలోకి బస్సు రాగానే మెయిన్ రోడ్డుపై ఇద్దరు పోలీసులు ఆ బస్సును ఆపే ప్రయత్నం చేశారు. ఇద్దరు పోలీసులను పట్టించుకోని ఆ దొంగ ఏ మాత్రం తగ్గేదేలే అంటూ బస్సును అదే స్పీడుతో ముందుకు పోనిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి తమ కళ్లుగప్పి పారిపోదామనుకున్న బస్సు దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకీ ఆ దొంగ ఏ ఉద్దేశంతో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడనేది తెలియాల్సి ఉంది.
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి… https://t.co/9C5mdMjAx8 pic.twitter.com/iutbdkIauO
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి… pic.twitter.com/eNzDx0aSKh
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Read Also :
KTR | అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు : కేటీఆర్
SP Sangram Singh Patil | క్రీడలతో మానసిక స్థైర్యం, పోటీ తత్వం పెరుగుదల : ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
Allu Arjun | రాకా షూటింగ్‌కు బ్రేక్.. అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్‌కు ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

