Allu Arjun | రాకా షూటింగ్‌కు బ్రేక్.. అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్‌కు ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Allu Arjun | ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా ఉండే అల్లు అర్జున్ తీరిక దొరికితే ఫ్యామిలీతో సరదా సమయం గడిపేందుకు రెడీగా ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాకా షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. బన్నీ ఫ్యామిలీ ఈ బ్రేక్ టైంలో వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేశారు.
Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా ఉండే అల్లు అర్జున్ తీరిక దొరికితే ఫ్యామిలీతో సరదా సమయం గడిపేందుకు రెడీగా ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాకా షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. బన్నీ ఫ్యామిలీ ఈ బ్రేక్ టైంలో వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేశారు.
ఇంతకీ వీరంతా ఎక్కడికెళ్లారనే కదా మీ డౌటు. ఆస్ట్రియన్ ఆల్ఫ్స్ పర్వతాల్లో చక్కర్లు కొడుతోంది బన్నీ ఫ్యామిలీ. అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి, అయాన్, అర్హతో కలిసి Innsbruck సమీపంలోని Nordkette Mountain Range పైకి వెళ్లాడు. సముద్ర మట్టానికి 1,905 ఎత్తులో నుంచి దిగువన వంకరగా ప్రవహించే ఇన్న నది అద్భుతమైన సుందర దృశ్యాలను వీక్షిస్తూ సేద తీరారు. డార్క్ బాంబర్ జాకెట్, కార్గో ప్యాంట్ వేసుకున్న బన్నీ, మరోవైపు స్నేహ సేమ్ మ్యాచింగ్ జాకెట్‌తో కలిసి స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తున్నారు. బన్నీ గ్రీనరీలో కూతురు అర్హతో కలిసి ఆడుకోవడం చూడొచ్చు. అల్లు అర్జున్ ఆస్ట్రియా టూర్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాకాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మలయాళ నటి ఫెమినా జార్జ్, పంజాబీ నటి నైలా గ్రేవల్ భాగమైనట్టువార్తలు కూడా వచ్చాయి. తెలుగు నటి సిరి హన్మంతు ‘రాకా’ చిత్రంలో జాయిన్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోంది. ఈ మూవీని 2027 చివరలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Allu Arjun Latest ❤️
For the first time since the Raaka shoot began, AA has taken a proper 2-week break from work.
He’s currently holidaying abroad (Austria, Europe) with his family and friends.
AA will return to sets in the first week of August.#Raaka #AlluArjun #RAAKA… pic.twitter.com/TbwJYjWE5o
— AlluArjunFANS (@AlluArjunFFANS) July 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

