Rajiv Yuva vikasam Scheme | జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకుగాను దరఖాస్తుదారులకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు మంగళవారంతో ముగిసాయి. మండలంలో రాజీవ్ వికాసం పథకానికి 2090 దరఖాస్తులు రాగా.. కేటగిరీల వారిగా నాలుగు రోజులపాటు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఒక్కొక్కరిగా వారు ఎంచుకున్న యూనిట్, నిర్వహణ, యూనిట్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల వంటి వివరాలను ఇంటర్వ్యూలో అధికారులు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1705 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు ఎంపీడీవో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్, సెర్ప్ ఏపీఎం సమత, టైపిస్టు తిరుపతి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు