Jagtial : జగిత్యాల – ధర్మపురి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కల్లెడ గ్రామం వద్ద ఓ చెట్టుకు కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఓ యువకుడు మరణించాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కల్లెడ గ్రామం వద్ద స్విఫ్ట్ డిజైర్ కారు అదుపు తప్పి ఓ చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలానికి చెందిన వారుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.