మల్లాపూర్, ఆగస్టు 2: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన సకినపల్లి కాశీం (60) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే కొందరు దుండగులు దాడి చేసి చంపేశారు.
భూ తగాదాలే ఈ హత్యకు కారణమై ఉంటుందని స్థానికులు చర్చింకుంటున్నారు. కాగా, వృద్ధుడి హత్య విషయం తెలుసుకున్న మెట్పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్సై రాజు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన వారు.. స్థానికులను అడిగి హత్యకు గల వివరాలను ఆరా తీశారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.