హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): మామిడి రైతుకు ఈ ఏడాది దిగుబడి దిగులు పట్టుకున్నది. చలి తీవ్రతతో పూత ఆలస్యమైంది. నవంబర్లో రావాల్సిన పూత జనవరిలో వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెల ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో పూత బాగా వచ్చింది. కానీ వాతావరణ మార్పులతో చీడపీడలు ఆశించి బూజుపట్టి పిందెలు రాలిపోతున్నాయి.
మహబూబ్నగర్, నల్లగొండ, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో చీడపీడలు మామిడి తోటలను ఆశించాయి.