ఖమ్మం : ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల ఢిల్లీలో విద్యార్థుల పోరాటం, సాధించిన విజయం చెంపపెట్టు వంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar ) పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం ఒక సమస్య పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలో మార్పును కోరుకునే యువత సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.
విద్యార్థులు, యువత ఆశయాలను విస్మరిస్తూ పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉద్యమం తీవ్రమైన హెచ్చరికగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాలను ప్రజలు సహించరని వారికి గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఈ విజయం మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. ఇకపై విద్యార్థులు, యువత సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో స్పందించి, ప్రజా సంక్షేమం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.