e-Shram | జగిత్యాల, మే 27 : జగిత్యాల జిల్లాలో ఫుడ్ డెలివరీ, హోమ్ సర్వీసెస్, కొరియర్ సర్వీసెస్, ఏసీ టెక్నిషియన్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్, ఉబర్, ఓలా, రాపిడో, స్విగ్గి. జోమోటో, జెప్టో, అర్షన్ కంపెనీ మొదలగు ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో విధులు చేసేవారు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తమ పేరు నమోదు చేసుకున్న కార్మికులకు ప్రభుత్వం అమలు చేసే సాంఘిక సంక్షేమ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. దీనికిగాను తమ మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా సొంతంగా గానీ, సీఎస్సీ సెంటర్లలోగానీ తమ పేరు నమోదు చేసుకొని యూనిక్ గుర్తింపు కార్డు పొందగలరని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగా వర్కర్స్ కు సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. దీనికిగాను ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు