కోరుట్ల, అక్టోబర్ 23 : మహిళా చిరు వ్యాపారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని పట్టణ నేషనల్ హాకర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు షాహిద్ మహ్మద్ షేక్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు చీరలను పంపిణీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని చిరు వ్యాపారులకు బతుకమ్మ చీరలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. చిరు వ్యాపారంతో జీవనం సాగించే కూరగాయలు విక్రయించే పేద మధ్య, తరగతి మహిళలకు బతుకమ్మ చీరలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎఫ్ కార్యదర్శి అబ్దుల్ ముసవీర్, ఫిరోజ్ బాబా, మల్లవ్వ, బాలక్క, లక్ష్మి, హనుమక్క, తదితరులు పాల్గొన్నారు.