మల్లాపూర్, మార్చి 16: తమకు ఇప్పటివరకు రుణమాఫీ (Runa Mafi) కాలేదని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట రైతులు వెల్లడించారు. వెంటనే తమ రుణాలుమాఫీ చేయాలంటూ సీఎం రేవంత్‌కి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం పార్టీలకతీతంగా స్థానిక మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలోని రుణమాఫీ కానీ రైతుల వద్ద నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతోపాటు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు వందమందికిపైగా రైతులకు ప్రభుత్వం అందించిన రెండు లక్షల రుణమాఫీ పథకం వర్తించలేదన్నారు. సుమారు 150 మంది రైతులు రెండు లక్షల రుణం పైబడి ఉన్న రైతులు ఉన్నారని తెలిపారు. ఈ దరఖాస్తులతో రేపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రజావాణిలో రైతులందరితో కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.