కోరుట్ల, ఆగస్టు 12: యువత గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ అరుణోదయ, రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిషా ముక్త భారత్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై ఎమ్మెల్యే మాట్లాడారు. మత్తు పదార్ధాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేస్తాయన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చదువు, ఉద్యోగం, క్రీడలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి మోబైల్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాను దూరంగా పెట్టి నైపుణ్యాభివృద్ధిపై శ్రద్ధ చూపించాలన్నారు. అనంతరం సమాజ సేవలో ముందుటామని, కోరుట్లకు మంచి పేరు తీసుకువస్తామని విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ రాజేశ్వరి, కరస్పాండెంట్లు పోతని ప్రవీణ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్, బెజ్జారపు ప్రవీణ్ ఎస్ఆర్ఎం ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ సాధన, కళాశాల అకాడమిక్ ఇంచార్జీ లక్ష్మీ భవానీ, చిద్రాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.