జగిత్యాల రూరల్, అక్టోబర్ 7 : వాల్మీకి మహర్షి జీవితం ఈ సృష్టి ఉన్నంతకాలం మనందరికి స్ఫూర్తినిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం గ్రామంలో వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి కీర్తి ప్రతిష్టలను ఆయన జయంతి సందర్భంగా స్మరించు కోవడం మన పూర్వజన్మ సుకృతం అని అన్నారు. సామాన్య ప్రజలకు రామాయణం సులువుగా అర్థమయ్యే విధంగా రామాయణాన్ని రచించిన వాల్మీకిని మనమందరం గుర్తుంచుకోవాల్సిన బాధ్యతుందన్నారు ఈ కార్యక్రమంలో బోయ సంఘం నాయకులు లోక శేఖర్, గంగయ్య, కుదిదేల పెద్ద గంగారం, చిన్న గంగారం, భోగ రాజం, భోగ సతీష్ తోపాటు నక్కల రవీందర్ రెడ్డి , భూపెల్లి శ్రీనివాస్, భువనగిరి నారాయణ, నోముల శేఖర్ రెడ్డి, ఎల్లాల రాజిరెడ్డి, కొట్టాల మల్లేశం, పడిగెల స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.