హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వాయిదా పడిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ పురపాలికల్లో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు అన్నదానిపై స్పష్టత రావడంలేదు. ఎన్నికలు నిర్వహించిన మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో 120 చోట్ల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకుగాను అత్యధికంగా పది వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఏడువార్డుల్లో కాంగ్రెస్, మిగతా ఐదు వార్డుల్లో ఇతరు లు గెలుపొందారు. చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పీఠాలను దక్కించుకొనేందుకు బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ గందరగోళం సృష్టించి ఎన్నికను వాయిదా వేశారు.
నిర్మల్ జిల్లా ఖా నాపూర్లో 12 వార్డులకుగాను బీఆర్ఎస్, బీజేపీ నాలుగు చొప్పున, కాంగ్రెస్ ఒకటి, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఇ క్కడ హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 24 వార్డులకుగాను 13 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి మెజార్టీ సాధించారు. ఇక్కడ గం దరగోళం సృష్టించి ఎన్నికను వాయిదా వేయించారు. ఈ మూడు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు వా యిదా మంత్రం ఉపయోగిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.