హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్‌లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడు జీ శ్రవణ్‌కు ఎక్సైజ్‌శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఈ మేరకు సోమవారం అధికారులు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేసిందని గుర్తుచేశారు. సౌమ్య చూపిన సాహసం వెలకట్టలేనిదని, కర్తవ్య నిర్వహణలో ఆమె చేసిన త్యాగం ఎక్సైజ్‌శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. అధికారులకు రక్షణ కల్పిస్తామని స్పష్టంచేశారు.