కోరుట్ల : ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా సమిపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృథాగా పోతున్నది.
అయినప్పటికీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. వేసవి కాలంలో నీరు వృథా చేయడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైప్లైన్కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్ చేశారు.