పెగడపల్లి: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద మండలంలోని మహిళా సంఘ సభ్యులకు రూ.2కోట్ల 19 లక్షల 95 వేల 800 వడ్డీ లేని రుణాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు గాను వారికి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లను ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు.
దీనికి తోడు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు కూడా అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూధన్ గౌడ్, డీఆర్డీవో రఘువరన్, ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, తహసీల్దార్ ఆనంద కుమార్, ఎంపీడీవో ప్రేమ్ సాగర్, ఆరఐ శ్రీనివాస్, ఏపీఎంలు రవివర్మ, రమాదేవి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, సీసీలు స్వామి, తిరుపతి, శశికుమార్, మండల సమాఖ్య సభ్యులు కవిత, రూపకళ తదితరులున్నారు.